Friday 11 December 2015

Beautiful Slave









i don’t know where i am
they’ve taken all that i had
smuggled in for a lucrative trade
beaten, bartered
broken in, until i obey
i used to be childlike
innocent and safe
now i’m someone else's treasure
a strangers pleasure
smothered in shame
succumbed with drugs
but I’m not numb
all I feel is pain
is this all a dream
will i ever be the same?

can anyone hear me?
will anyone break these chains?
who will free me?
from this dark place?
does God see me?
what is His name?
will He help me?
i’m just a beautiful slave

my worst fear is my fate
i’m getting older each day
every girl too old in years
mysteriously just disappears
they never mention her name
they take away piece by piece
i don’t think i have any left
i’ve slowly given up all hope
given in to this sleepless bed
inside these bars
i feel so seared
by each new face
how could this ever be
every memory be erased?









Tuesday 8 December 2015





मुझे उतनी प्रेम पत्र मत लिखना
मैं तो भला , अनपढ़ हूँ

मुझ से उतना मोहब्बत ना करना
मैं तो बड़ा बदनसीब हूँ

तू मेरे विचार धारा पसंद करती हो
मुझे नहीं

तुझे मेरे शायरी से इश्क़ चल रहा है
मुझ से नहीं

मेरे सपने कभी न देखना
मैं वैसा नहीं हूँ जैसा तुम्हे नजर आता हूँ

अरे , किसी बेवफा का शिकार , और किसी का
मेहबूबा कैसे बन सकता ?

तुम्हारी हमदर्दी की दवा देकर
मेरे घावों का इलाज नहीं करना

वहाँ बाग़ बगीचे पैदा नहीं होते
जहाँ मुर्दों का अंतिम संस्कार किये जाते

मेरे लिए इधर उधर मत ढूंढना
मैं तो वहाँ नहीं मिलता जहाँ तुम देखती हो

मैं तो कब का मर चूका हूँ , और
भूत बनकर हवा में उड़ता रहता हूँ

मुझ में भी इनसानियत देखनेवाली
तेरी मासूमियत को इज्जत करता हूँ , और
लाख लाख शुक्र अदा करता हूँ







Saturday 5 December 2015









రాసే..... హరిమిహ విహిత విలాసం
సంచరదధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం ।
చలిత దృగంచల చంచల మౌలి కపోల విలోల వతంసమ్‌ ॥

రాసే..... హరిమిహ విహిత విలాసం
స్మరతి మనో మమ కృత పరిహాసమ్‌ ॥ (ధ్రువమ్‌) ॥
చంద్రక చారు మయూర శిఖండక మండల వలయిత కేశం ।
ప్రచుర పురందర ధనురనురంజిత మేదుర ముదిర సువేషమ్‌ ॥
గోప కదంబ నితంబవతీ ముఖ చుంబన లంభిత లోభం ।
బంధుజీవ మధురాధర పల్లవకలిత దరస్మిత శోభమ్‌ ॥
విపుల పులక భుజ పల్లవ వలయిత వల్లవ యువతి సహస్రమ్‌ ।
కర చరణోరసి మణి గణ భూషణ కిరణ విభిన్న తమిస్రమ్‌ ॥
జలద పటల చలదిందు వినిందక చందన తిలక లలాటం ।
పీన పయోధర పరిసర మర్దన నిర్దయ హృదయ కవాటమ్‌ ॥
మణి మయ మకర మనోహర కుండల మండిత గండముదారం ।
పీతవసన మనుగత మునిమనుజ సురాసుర వర పరివారమ్‌ ॥
విశద కదంబ తలే మిళితం కలి కలుష భయం శమయంతం ।
మామపి కిమపి తరంగదనంగ దృశా మనసా రమయంతమ్‌ ॥
శ్రీ జయదేవ భణిత మతిసుందర మోహన మధు రిపు రూపం ।
హరి చరణ స్మరణం ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపమ్‌ ॥











Friday 4 December 2015




మేలిముసుగు
=========
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు
మంచికో చెడుకో నను మరుగున దాచే
ఈ పదాని తొలగించాలని చూడకు .

నేనో అపరిచితను !
పదిహేడేళ్ళకే కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకుని
లేత బుజాలమీద మోయలేని బరువులు మోస్తూ
అడుగడుగునా చూపుల అత్యాచారాలకి మాటల తూటాలకి 
సిగ్గుతో చితికి జలపాతాలై కురిసే కళ్ళు చూడాలని కోరుకుంటూ
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు

నేనో పరిత్యక్త ను !
కోరికలే కొండెక్కి ఆశలన్నీ ఆవిరై పోయి
కలలన్నీ చెదిరి పోయి బంధాలు బరువై పోయి
నావారో పైవారో ఎవరో తెలీని వాళ్ళందరి కోసం అంకితమైన
నా ముఖం లోని ఆవేదన చూడాలని కోరుకుంటూ........
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు

నేనో ప్రశ్నని
సమాధానం ఉండదు 
నేనో మొండి వ్యాధిని 
ఔషధం దొరకదు
అవ్యక్త గా
అదృశ్య గా
అనామిక గా
అపరిష్కృత గా
అసూర్యం పశ్య గా
నన్నిలాగే మిగిలిపోనీ !

నువ్వు రాముడివే కానీ
నీ పదము సోకని అహల్యగా
నా ప్రియతమా !
ఈ మేలిముసుగు లోనే నన్నుండి పోనీ !








పరిచయం
======
నీ ఒక్క పరిచయం తో
జీవితం లో ఎన్నెన్నో 
కొత్త పరిచయాలు........
నువ్వు కనిపించినపుడల్లా 
గుండె లయతప్పడం పరిచయమైంది 
నువ్వు చిర్నవ్వు విసిరినపుడు
ఊపిరి ఆగి పోవడం పరిచయమైంది
నువ్వు గల గలా మాటాడుతుంటే
మనసు ఉయ్యాలలూగడం పరిచయమైంది
నువ్వు నా బైక్ వెనకాల ఎక్కినపుడు
గాల్లో తేలిపోవడం పరిచయమైంది
యూ ఆర్ వెరీ స్పెషల్ అన్నప్పుడు
ఛాతీ ఉప్పొంగడం పరిచయమైంది
నువ్వు సినిమా కొచ్చిన ప్రతీ సారీ
అమ్మకి అబద్ధం చెప్పడం పరిచయమైంది
నువ్వు రాకుండా ఎగ్గొట్టే సాయంత్రాలు
ఎదురు చూడ్డం పరిచయమైంది
మెసేజ్ లకి రిప్లై ఇవ్వకపోతే
మతి పోవడం పరిచయమైంది
నువ్వు పండక్కి ఊరెళ్ళి నపుడు
పిచ్చెక్కడం పరిచయమైంది
నువ్వు అనుక్షణం గుర్తు కొచ్చి
గుండె బరువెక్కడం పరిచయమైంది
ఫోనెత్తకుండా వేధించినప్పుడు
నరక యాతన పరిచయమైంది
నువ్వు కాలేజ్ కి తిరిగి రాగానే
పట్టరాని వెర్రానందం పరిచయమైంది
నాకులమేంటని అడగ్గానే 
నీ తత్వం పరిచయమైంది
నా ఆస్తి గురించి ఆరా తీసినపుడు
నీ నైజం పరిచయమైంది
నువ్వెక్కడ నేనెక్కడ అన్నపుడు
వాస్తవం పరిచయమైంది












వేదనకి వెయ్యేళ్ళ ఆయుర్దాయమట ,
వేడుక మాత్రం చిత్రం గా 
పురిట్లోనే చని పోతుందంట !
అనునిత్యం కాకులు అరిచే చోట
కోకిల మాత్రం ఎప్పుడో ఒక్కసారి
కూ... కూ.... లాడుతుందంట !
గుచ్చే ముళ్ళు ఏటెల్ల కాలం వర్ధిల్లితే
పరిమళాల పువ్వులు మాత్రం 
ఏ వసంతంలోనో విరబూస్తాయంట !
మీ ఇంటి నిండా కుళ్ళు కపటం మోసం 
తందనాలాడుతూ , మంచివాడికి కూర్చోడానికి
పాపం ! ఒక కుర్చీ కూడా లేదంట !






Thursday 3 December 2015





మయూరివై నర్తించి
అభిసారికవై అభినయించి
సత్యభామవై కసరి కినిసి
ఒయ్యారివై మరులు కొల్పి 
రాయంచవై హొయలొలికి 
అలసి ..... సొలసి .....
నిదురించె సొగసరి ...
మనోహరి .. కూచిపూడి విరి ....










ఎంత మంచోడివి మావయ్యా !
నువ్వు నాకు దేవుడివే మావయ్యా !

నీకు కులం గోత్రం ఆచారం 
సంప్రదాయం అన్నీ కావాలి 
కనుకే , 
ఒకటికి పదిసార్లు మాఇంటిచుట్టూ తిరిగి 
కట్నమిచ్చి , కాళ్ళు కడిగి 
మరీ కన్యాదానం చేశావు .

అదే నీ తిక్క కూతుర్ని.... వలేసి.....వెంటబడి... 
బీటేసి ......... పడేసి ......
పెళ్ళాడాలంటే నా తరమా మావయ్యా ?

అల్లుడాఫీసరనే 
నలుగుర్లో పేరుకోసం
నన్ను  సంతలో  
కొనేశావు మావయ్యా !
నా గొంతు కోసి 

పాడేశావ్ మావయ్యా !

నీకు జడిసే కదా నన్ను ఏమండీ .......
అని పిలుస్తుంది !
ఏరా అనడానికి ఎంత సేపులే మావయ్యా !

నీకు భయపడే కదా మామయ్యా ,
నాకు నాలుగు మెతుకులు వండి పెట్టేది !
లేపోతే ఎప్పుడో నన్ను చైనీస్ మెక్సికన్ ఇటాలియన్ క్యూసిన్లలో 
ఆరితేరిన షెఫ్ గా మార్చేసేది ! 

ఒక్కమాట , అడగకుండా 
ఉండలేకపోతున్నాను మావయ్యా !
ఆడపిల్లల్ని కనేసి
వాళ్లకి ఫ్యాంట్లూ షర్టులూ తొడిగి
ఏరా ఒరే అని  పిలుస్తూ 
హాస్టళ్ళలో చదివించి 
స్కూటీలు కొనిచ్చి , 
బేగ్గుల నిండా డబ్బులు కుక్కి
మగరాయుళ్ళలా పెంచి 
మా నెత్తిన పడేసి , నీ చావేదో నువ్వే చావంటే
ఎలా చచ్చేది మావయ్యా ?

దానికి చీర కట్టి , తల దువ్వి జడవేసి 
సరిచేసి , శృతి చేసి 
నానా తంటాలూ పడి , మళ్ళీ 
ఆడదానిగా మార్చడానికి ,
జీవితం సరిపోయేలా ఉంది మావయ్యా !
బతుకు బస్టాండు మావయ్యా !
సంతోషం షెడ్డుకే మావయ్యా !





Wednesday 2 December 2015




కన్నులలోనూ వాడే .....
తలపుల్లోనూ వాడే ......
కలల నిండా వాడే .......
మనసంతా ఆక్రమించీ వాడే .....
మాటల్లోనూ వాడే .....
రాసే లేఖల్లోనూ వాడే .....
ఇక ఆ ఒక్క చోటూ 
మిగిలిందని కాబోలు ...
ఈ మధ్యే ఇక్కడా
చేరిపోయాడు వాడే ...
చిన్నారి పాపడై వాడే

చిట్టి పొట్టి కాళ్ళతో తన్నుతూ వాడే 
నా ప్రియమైన .. ముద్దుల .. రేడే 
నా .... వాడే .....! !


दिल में भर गया था वो 
नैनों में बस गया था वो
नजरों में रह गया था वो
सपनों में भर गया था वो
सारा जहाँ है वो
दुनिया भर में हैं वो

शायद एक ही जगह रह गया था
जहाँ अब तक नहीं थे वो
इसी लिए तो यहाँ भी आ करके 
आज कल बसने लगे थे वो 
नन्हे मुन्हे बनकर है वो
मेरे प्यारे प्यारे .... वो

मेरे मीठे मीठे .... वो  








పింకూ !
పొద్దున్నే ఒక ఎన్వలప్ 
కొరియర్ లో వోచ్చిందే !
ఓపెన్ చేసి చూస్తె 
బోలెడు పెయింటింగ్సు .
ఒక పెద్దావిడ బొమ్మ !
ఎంత బాగుందో , 
మహా లక్ష్మిలా 
అన్నపూర్ణ లా 
కనకదుర్గ లా,
దానితో పాటు 
ఇద్దరు ప్రేమికులు
రాదా క్రుష్ణుల్లా !
అన్ని పెయింటింగ్స్ వెనకా
రెండు పేర్లు పదే పదే రాశావు 
ఒక పేరు అమ్మ .....
రెండో పేరు ......
వెంకట్...... 
సరిగ్గా ఇలా ...
అమ్మ....వెంకట్...అమ్మ....వెంకట్ 
అమ్మ....వెంకట్...అమ్మ....వెంకట్ 
అమ్మ....వెంకట్...అమ్మ....వెంకట్ 
అమ్మ....వెంకట్...అమ్మ....వెంకట్ 
ఎవ్వడే ?
ఎవ్వడే ?
ఎవ్వడే ఆ వెంకట్ ?
వాడంటే నీకు 
అమ్మంత ఇష్టమా ?
ఇష్టమా ?
ఇష్టమా ?
ఇష్టమా ?








నాకు పెళ్లి చెయ్యకు నాన్న 
నన్ను వేరెవళ్ళకో ఇచ్చేయకు నాన్న
ఆరేళ్ళ పాపనీ , దేవుళ్లాంటి నిన్నూ
అర్ధంతరం గా వదలి వెళ్ళిన నీ పెళ్ళాం 
తిరిగి నా కడుపున పుట్టాలని కోరుకుంటూ
నాకు సంబంధాలు చూడకు నాన్న
నువ్వు గట్టిగా అడిగితే కాదనలేను
నువ్వు బాధ పడితే చూడలేను
పసివాడివి నిన్ను పెంచుకోనీ నాన్న
ఈ పెళ్లి చూపులూ అవీ వద్దు నాన్న






Tuesday 1 December 2015


Plz  select this link , and right click on it , and go to the link .

and  watch I am a very good girl vidio song by Gunnam Ganga Raju


http://tollywoodtalent.blogspot.in/2015/12/not-so-little-soldiers-im-very-good-girl.html




Plz  select this link , and right click on it , and go to the link .


or



go to you tube , type '' lovely rivals english sub titles '' and watch the movie



https://www.youtube.com/watch?v=WWdAx-_ftVI