Thursday 3 December 2015




ఎంత మంచోడివి మావయ్యా !
నువ్వు నాకు దేవుడివే మావయ్యా !

నీకు కులం గోత్రం ఆచారం 
సంప్రదాయం అన్నీ కావాలి 
కనుకే , 
ఒకటికి పదిసార్లు మాఇంటిచుట్టూ తిరిగి 
కట్నమిచ్చి , కాళ్ళు కడిగి 
మరీ కన్యాదానం చేశావు .

అదే నీ తిక్క కూతుర్ని.... వలేసి.....వెంటబడి... 
బీటేసి ......... పడేసి ......
పెళ్ళాడాలంటే నా తరమా మావయ్యా ?

అల్లుడాఫీసరనే 
నలుగుర్లో పేరుకోసం
నన్ను  సంతలో  
కొనేశావు మావయ్యా !
నా గొంతు కోసి 

పాడేశావ్ మావయ్యా !

నీకు జడిసే కదా నన్ను ఏమండీ .......
అని పిలుస్తుంది !
ఏరా అనడానికి ఎంత సేపులే మావయ్యా !

నీకు భయపడే కదా మామయ్యా ,
నాకు నాలుగు మెతుకులు వండి పెట్టేది !
లేపోతే ఎప్పుడో నన్ను చైనీస్ మెక్సికన్ ఇటాలియన్ క్యూసిన్లలో 
ఆరితేరిన షెఫ్ గా మార్చేసేది ! 

ఒక్కమాట , అడగకుండా 
ఉండలేకపోతున్నాను మావయ్యా !
ఆడపిల్లల్ని కనేసి
వాళ్లకి ఫ్యాంట్లూ షర్టులూ తొడిగి
ఏరా ఒరే అని  పిలుస్తూ 
హాస్టళ్ళలో చదివించి 
స్కూటీలు కొనిచ్చి , 
బేగ్గుల నిండా డబ్బులు కుక్కి
మగరాయుళ్ళలా పెంచి 
మా నెత్తిన పడేసి , నీ చావేదో నువ్వే చావంటే
ఎలా చచ్చేది మావయ్యా ?

దానికి చీర కట్టి , తల దువ్వి జడవేసి 
సరిచేసి , శృతి చేసి 
నానా తంటాలూ పడి , మళ్ళీ 
ఆడదానిగా మార్చడానికి ,
జీవితం సరిపోయేలా ఉంది మావయ్యా !
బతుకు బస్టాండు మావయ్యా !
సంతోషం షెడ్డుకే మావయ్యా !





No comments:

Post a Comment