Wednesday 9 September 2015



అందం ...... మనసు 
----------------------


నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే
అది డబ్బుతో కొనుక్కోగలిగేదే అయితే
కొంచెం ఖరీదైనదైనా కష్టపడో తిప్పలు పడో
ఎలాగోలాగ కొనుక్కుంటాను ,
నువ్వే తెచ్చివ్వక్కర్లేదు , అవసరం లేదు .


లక్షలు వెచ్చించినా కొనలేనిదీ
తలకిందులుగా తపస్సు చేసినా దొరకనిదీ
ఏదైనా ఉంటే .......? నాకోసం దాస్తే  ........ ?
చందమామలా చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా 
నాకు తెచ్చివ్వు , తీసుకుంటా .


ఆ రోజు మూర్చే పోతానో పిచ్చెక్కె పోతానో 
నా ప్రియతమా ! చూద్దాం ! !
 ముందు నువ్వు డబ్బు తో కొనగలిగే వాటిని చూసి
మురిసి ముక్కలై గర్వించడం మానుకొ  . . . . .
ఏదైనా మాట్లాడేముందు కాస్త వాడు .........! !


నీ అంత ఉదార హృదయం నాకు లేదు 
మూర్చ పోయినోడిని నీళ్ళుకొట్టి లేపుతానన్నావు 
అదే నేనైతే ఒక ఆడదాని అందంచూసి మైకంలోకిపోయిన 
పనికిమాలిన వెధవ మొఖం మీద 
నీళ్ళు కాదు కదా సు..సూ.. కూడా కొట్టను . 








1 comment:

  1. నిన్న కాదు రేపూ కాదు
    ఎప్పుడూ నే రాజా !
    కోట లేదు సైన్యం లేదు
    అప్పుడూ నే రాజా !
    రాజా రాజాధి రాజేందర్రాజా !

    ReplyDelete