Thursday 17 March 2016


मंदिर में नहीं , नहीं मधुरापुर
बृन्दावन में नाही
पर्वत पहाड़ बाग़ बगीचे
किशन को कहीं न पाये

स्वर्ग पाताल अवनि तल में
नहीं देखे मधु सूदन
दुखित ह्रदय से मीरा बोली
राधा ! किशन को छोड़.......

तोहे मन में , बंद गोपाल को
मुक्त करिय्यो राधा !
मुरली मोहन नन्द नंदन की
दरिशन  करिय्यो राधा .........

प्रभु दरिशन  बिना
जीवित ना रही
कृपा करिय्यो राधा !
साधू संत ऋषि आतुर देखत
रहम करिय्यो राधा !

मीरा के प्रभु गिरिधर नागर
बसत राधा मन मंदिर
राधा प्रीतम नन्द गोपाल
बसत राधा मन मंदिर

कृपा करिय्यो राधे राधे
दरिशन करिय्यो प्रभु के.......

మందిరమున కానడు
మధురా నగరిలో కానడు
బృందావనమున లేడు
కొండలు కొనలు ఉద్యానవనములు
ఎక్కడ వెదికినా లేడు

స్వర్గ మర్త్య పాతాళ లోకముల
అతని జాడలు కూడా లేవు
నంద నందనుడు
నవనీత చోరుడు కానగ లేడు

దుఖిత యై మీరా అడిగెను
రాధా ! కృష్ణుని విడిచి పెట్టు
నీ మనస్సులో బందీ గా ఉన్న
మురళీ మోహనుని దర్శనము కలిగించు

ప్రభు దర్శనము లేకుంటే
నేను జీవించ లేను
రాధా ! నామీద దయ చూపించు
సాధువులు గురువులు ఋషులు
ఆత్రముగా వేచియున్నారు
రాధా , కనికరము వహించు

మీరా ప్రభువైన గిరిధర గోపాలుడు
రాధ మనసులో కొలువైనాడు
రాధా సఖుడు నంద నందనుడు
రాధ మనసులో నివసిస్తున్నాడు

దయ చూపించు రాధే రాధే
ప్రభు దర్శనము కలిగించు
















No comments:

Post a Comment