Tuesday 14 July 2015





ఇంతింతై  మరింతై
అణువు పెరిగి గుండె అంతై  , అల్లంతై
ఒకింత పెరిగి వట వృక్షమంతై 
మరు లిప్తకే కొండంతై
అంత లోనే చక చకా పెరిగి 
ఆకాశమున్ తాకి , మరు క్షణమున్ 
దిక్కుల్ దాటి , చుక్కల కావల 
ఊర్ధ్వ లోకంబులెల్లన్ జూచి 
మరింత పెరిగి
బ్రహ్మాన్డమంతై...................
నన్ను వేధించి వధించి చంపి
కోరిక పెరిగి పోయే .............
దానితో మాటలాడ వలెనని
దానిని చూడవలెనని
ఒడిలో గైకొని ముద్దాడ వలెనన్న
కోరిక పెరిగి పోయే ..................
కనరాని ఎత్తులకు  ఎదిగి పోయే ....
నా బెట్టు సడలి పోయే .............
పట్టుమని పది రోజులు దానిని వీడి 
బెట్టుగా ఉండలేని గతి పట్టే ... అకటా !
ఈ ప్రేమ ఏనాటిదో ................. ?







No comments:

Post a Comment