Monday 6 July 2015









నేను కాని వ్యక్తిని 
నన్నుగా ఊహించుకుంటున్నావు 

నాకు లేని లక్షణాలు అంటగట్టి
అపోహ పడుతున్నావు

నీ ఇష్టమొచ్చిన బొమ్మ గీసుకుని
కింద నా పేరు రాస్తున్నావు 

కాపాడుకోవలసిన నన్ను
కుళ్ల బొడుస్తున్నావు 

నీకు తెలిసిన మొహాల్లో 
నాదీ ఒకటని భ్రమిస్తున్నావు 

నన్ను పొందడానికి ఏవి చెయ్యకూడదో 
సరిగ్గా అవే చేస్తున్నావు ..............








No comments:

Post a Comment