Thursday 9 July 2015







నాకు మనసుందో లేదో తెలీదు 
ఉంటే ఎందుకింత వికలమయ్యిందో తెలీదు .
ఎన్ని దెబ్బలు తగిలినా ఎప్పటి కప్పుడు కొత్తగా ఎందుకు  
విలవిలలాడుతూ వ్యధ చెందుతుందో  అసలు తెలీదు.
వెన్నలాటి మనసిస్తే విచ్చుకత్తులతో ఎందుకు
నిలువునా  తెగ నరికావో తెలీదు .
నీ కోపం ఎవరి మీదో ...
నన్నెందుకు శిక్షిస్తున్నావో తెలీదు .
ఎన్ని సార్లు గాయపడ్డా , నా మనసు 
మళ్ళీ మళ్ళీ ఎందుకు కరుగుతుందో తెలీదు .
వేదనతో నాకున్న బంధుత్వం ఏమిటో తెలీదు
ఈ దుఖం ఇంకా ఎన్నాళ్ళో నిజంగా తెలీదు .................. 






No comments:

Post a Comment