Thursday 2 July 2015









నా మీద మనసులో లక్ష భావాలున్నా 
నాకు చెప్పాలని అనుకుని దాచుకున్న మాటలు కోటి ఉన్నా 
ఏ ఒక్కటీ మనసు విప్పి నిజాయితీ గా
నాతో పంచుకోనంత కాలం 
నువ్వు నాకు అపరిచితవే...............

రోజుల తరబడి నన్నెరిగి ఉన్నా , గంటలు గంటలు కబుర్లాడినా 
నువ్వు మెచ్చిన రోజున ఐ లవ్యూ అనీ
నేను అలిగిన రోజున సారీ అనీ , ప్రేమ నిండిన పలుకులను 
నిబద్ధత తో నాకు చెప్పలేనంత కాలం
నువ్వు నాకు అపరిచితవే...............

పనికిమాలిన సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళందరూ ఫ్రెండ్సనీ
ఊదరమోకు వాగుడు వాగి నిన్ను ఎంటర్టైన్ చేసేవాళ్ళు
మంచోళ్లనీ  ,  నీవాళ్ళనీ  భావిస్తూ , వాళ్ళతో సమస్తమూ పంచుకుని 
నన్ను చూడగానే ముడుచుకు పోయినంత కాలం 
నువ్వు నాకు అపరిచితవే...............

నావాడు నేను వలచినవాడు అనే అనురాగం లేనంతకాలం
మనసున్నోడు మంచివాడు అని  నామీద గౌరవం లేనంతకాలం
చిన్న చూపు నిర్లక్ష్యం తో నిరాదరించినంత కాలం
నేనెవర్నో నువ్వు గుర్తించలేనంత కాలం 
నువ్వు నాకు అపరిచితవే...............


అపరిచితవే...............
నువ్వు నాకు అపరిచితవే...............










1 comment:

  1. ఎంతో వ్యధని సున్నితంగా చెప్పాలనుకునే ప్రయత్నం చేసారు.

    ReplyDelete