Saturday 1 August 2015




దొంగ కోళ్ళు పట్టే దాంతో
దాగుడు మూత లాడాలంట
కొండ ముచ్చు మొహం దానితో
కోతి కొమ్మచ్చు లాడాలంట
గుడ్ల గూబ కన్నుల దాంతో
గుడు గుడు గుడు గుంచా లంట
కుళ్ళు బుద్ధుల కాంతా మణి తో
కాళ్ళా గజ్జి ఆడా లంట
చిర్రు బుర్రు చుంచు దానితో
చింత పిక్క లాడాలంట
కస్సు బుస్సు కొండే కాకి కి
కౌగి లింత లియ్యాలంట


No comments:

Post a Comment