Monday 22 June 2015

వేయి యజ్ఞములు చేసిన
గురుతు లేదు
వంద క్రతువులు చేసిన
ఎరుక లేదు
ఏ జపము చేసితినో
జ్ఞప్తి లేదు
ఏ తపః ఫలమో
తెలియలేదు
భూరి దానములు చేసిన
స్పృహ కలుగుట లేదు
మరి ఎవరు వరమిచ్చారో
ఏ దైవ కృప యో
మూర్తీభవించిన పుణ్యమై
గోచరిస్తోంది ,
నా మనోహరియై
నా కల్పవల్లి యై
నా రాణి యై ....











2 comments: