Monday 22 June 2015




రానులే , మరెప్పటికీ రానులే ....
అడగనులే ,
శాశ్వతం గా నిన్ను నా దాన్ని
చేసుకుంటానని ,
మరెన్నటికీ అడగను లే
ఒక్కడి త్యాగంతో వెయ్యిమందికిలాభంఅంటే
ఆ త్యాగమేదో నేనే చేస్తాలే
ఒక్కడి ప్రాణం తో వెయ్యి మంది జీవిస్తారంటే
ఆ ప్రాణ మేదో .....
నా ప్రాణానికి ప్రాణమేదో
నేనే ఒదిలేస్తాలే
వంద మంది అనాధలకి అమ్మవు
మరెందరికో అక్కవు
అనేకులకు
ఆప్తురాలివి అవసరానివి
మూడు నెలలకోసారి బాటిల్ రక్తానివి
నిన్ను దొంగిలించనులే
నా ప్రేమ పంజరం లో చిలకని చేసి
నాతో ఎత్తుకు పొనులె
నీ ఆశయాలకి తూట్లు పొడిచి
నా స్వార్ధం కోసం నిన్ను
దురాక్రమణ చేయ్యనులే
సుఖం గా ఉండు ప్రియా , నీ సుఖం కన్నా
పరుల సుఖమే ముఖ్యమైన
నా పిచ్చిదాన   !  !   నా వెర్రిదాన  !  !
నా అమ్మాడి పండూ !  నా బుల్లిపాపా !
నా సర్వస్వమా
నిన్ను త్యాగం చేస్తున్నా ! !








No comments:

Post a Comment