Tuesday 23 June 2015





ఎన్ని అనుమానాలో నీకు .....
మరిన్ని సందేహాలో ...
ఏమన్నావ్ ? 
'' మొదట్లో కొంతకాలం ఐస్ క్రీమ్ లా స్వీట్ స్వీట్ గా 
అనిపిస్తాను , మెల్లి మెల్లిగా బోర్ కొట్టేస్తాను
ఇప్పుడు ముద్దుగా మురిపెంగా కనిపించే  
నా మాటలు చేష్టలు నీకు విసుగ్గా అనిపిస్తాయ్......''
అంటావా ?
భవిష్యత్తు లో నీలాంటి బ్రహ్మరాక్షసిలు పుడతారని ఊహించే కాబోలు 
పెద్దవాళ్ళు ఈ మేనరికం అనేదాన్ని కనిపెట్టారు ..... తెలుసా ?
ఆ మొహం చూసినప్పుడల్లా , అది మా మావయ్యదేమో ......
అని  అనుమానం ..... ఆ కళ్ళు మా అమ్మవేమోనని అనుమానం .
ఆ ముక్కు మా పిన్నిదేమో అని మా చెడ్డ అనుమానం .
నీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం నాదేమోనని అనుమానం ......
ఇన్ని అనుమానాలు మనసుని ముల్లులా గుచ్చుతుంటే
ఈ బావకి నువ్వు బోర్ కొడతావంటావా ? 
నా బంగారు మామ కూతురు మీద విసుగొస్తుందంటావా ?
ఎంతకాలమయినా నువ్వు నాకు బోర్ కొట్టవు తెలుసుకో .....!!
ఆ బంధుత్వం వల్లే ఈ మమకారం ....
ఆ బంధమే ఈ మమకారం ... తెలుసుకో 







No comments:

Post a Comment