Wednesday 24 June 2015





వేళ కాని వేళ ఫోన్ చేశానంటే 
గుర్తుకోచ్చావనీ మాట్లాడాలని
అనిపించింది అనీ అనుకో ....


వెయ్యరాని చోట చెయ్యి వేశానంటే
ప్రణయ వీచిక జ్వాలలై
నీ విరహం దహిస్తోందనీ అనుకో...  


పదే పదే పొందు కోరితే 
మరులుగొన్నాననీ నిగ్రహం
సడలిందనీ అనుకో ........


విసిగినా కసిరినా మౌనం దాల్చినా
నాదానివనీ  నాసొంతమనీ
భావిస్తున్నానని అనుకో ......


మనసైనదానివి 
మనసిచ్చినదానివి 
మనసెరిగినదానివి , ప్రియ సఖివి నువ్వే
మరి కొంచెం సర్దుకో  ! !














2 comments: