Monday 22 June 2015




పూర్వ జన్మ లో నేను దుర్మార్గుడిని
నీ మొహమ్మీద ఏసిడ్ పోశాను .
అంతకు ముందు జన్మ లో నేను రాక్షసుడిని
నిన్ను నమ్మించి మోసగించి
వేశ్యా గృహం లో అమ్మేశాను .
చిత్రహింసలు పెట్టాను .
ఈ జన్మలోనూ చెడ్డవాడిగా నే పుట్టాను
అరె , మంచివాడిగా పుట్టుంటే
వృద్ధాశ్ర మం లో ముసలోడిగా పుట్టేవాడిని
నువ్వు నీ చేతులతో చేసే పాయసానికీ
నీ ఆప్యాయతతో కూడిన మాటలకీ
నోచుకునే వాడిని
లేదా బ్లైండ్ స్కూల్ లో అమ్మాయి గానో
అనాధ శరణాలయం లో కుర్రోడిగానో
పుట్టి ఉండేవాడిని .
ఊహూ , నేను నేనుగానే పుట్టాను
అదే ధ్యాస .... అదే లక్ష్యం
నువ్వు కావాలి.... నిన్ను పొందాలి...
నువ్వు ఎప్పట్లాగే పుట్టావు దేవతలా...
వెన్నెలలా.... అనురాగంలా..... కల్పవల్లిలా....
మళ్ళీ నీ వెంట పడుతున్నాను
నా ప్రేమ కేంద్రీ కృతమైనది
నువ్వే ... నువ్వే .... నువ్వే
విస్తరించిన నీ ప్రేమను దుప్పటిలా చుట్టేసి
నా బెడ్ రూం లో పరుచుకోవాలి  !!
నిన్ను నా సొంతం చేసుకోవాలి !!
హా హా , ప్రతి జన్మ లోనూ
నేనే గెలవాలంటే ఎలా ?
ఈసారి నువ్వు గెలుస్తున్నావు
నేను నీ వెనక పరుగెత్త లేక పోతున్నాను
నిన్నందుకో లేక పోతున్నాను
మెల్లి మెల్లిగా నాకర్ధ మవుతోంది
దశరధుడు తన కొడుకు కోసం
కుమిలి కుమిలి క్రుంగి క్రుంగి .......
నేను కూడా నీకోసం అచ్చు అలాగే
కుమిలి కుమిలి క్రుంగి క్రుంగి .......









No comments:

Post a Comment