Tuesday 23 June 2015





ఎవరు నువ్వు ? నన్నేం చేస్తున్నావ్ ?
ప్రేమవా ? అనురాగానివా ? బంధానివా ?
గులాబి రేకుకు రంగు ఆకర్షణ , సున్నితత్వం లక్షణం అయితే
పరిమళం కూడా ఉంటుంది కదా మరి  అదేంటి ?
ప్రేమంటే అదేనా ? 
అసలు ప్రేమంటే ఏమిటి ? ఎలా ఉంటుంది ?
నేనెందుకు సుడిగుండం లో పడి తిరుగుతున్నాను ? 
తెలియాలి......... తెలుసుకోవాలి ..........
నీకూ నాకూ మధ్య ఎన్నో వైరుధ్యాలు !
మనసులు  మాత్రం విచిత్రం గా ఎలా ఒకటయ్యాయ్ ?
తెలియాలి......... తెలుసుకోవాలి ..........
ఒక్కటి మాత్రం తెలుస్తోంది !
నిన్ను కలుసుకోవడమంటే నన్ను నేను కలుసుకోవడమే ..
నిన్ను నేను చూడడమంటే నన్ను నేను చూసుకోడమే ..
నిన్ను ఆరాధించడమంటే నన్ను నేను అర్చించుకోడమే...
నిన్ను ముద్దాడడమంటే నన్ను నేను గౌరవించడమే ...
నిన్ను కౌగిలించడమంటే కృతజ్ఞత తెలుపుకోడమే.........
అంతకు మించి నిన్ను ఏమిచేసినా నీ ఋణం తీర్చుకోడమే !!






No comments:

Post a Comment